అభినందన్‌ కోసం విమానాన్ని పంపుతామంటే వద్దన్న పాక్

పాకిస్థాన్‌ అదుపులో ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపించేందుకు భారత్‌ ప్రయత్నించినట్లు సమాచారం. అయితే.. అందుకు పాక్‌ నిరాకరించిందట. పాక్‌ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా దిల్లీకి తీసుకొచ్చి ఆయనకు వెంటనే వైద్య చికిత్స అందించాలని భారత్‌ భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐఏఎఫ్‌కు చెందిన విమానాన్ని పంపిస్తామని అందులో అభినందన్‌ను పంపించాల్సిందిగా పాక్‌ను కోరింది. కానీ అందుకు పాక్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. రోడ్డు మార్గం ద్వారా వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను అప్పగిస్తామని తెలిపింది.

అభినందన్‌ను ఆహ్వానించేందుకు వాఘా సరిహద్దు వద్ద భారీగా ప్రజలు చేరుకుంటారని దీని వల్ల భద్రతా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వాయు మార్గంలో ఆయన్ను భారత్‌ తీసుకురావాలని అనుకున్నారు. పాక్‌ అదుపులో ఉన్న అభినందన్‌ను అప్పగిస్తామని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.

పాక్‌లోని భారత్‌ హైకమిషన్‌ కార్యాలయం ఇప్పటికే అభినందన్‌ అప్పగింతకు సంబంధించిన పత్రాలను పూర్తి చేసి వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు మధ్య అభినందన్‌ వాఘా సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉంది. అభినందన్‌కు స్వాగతం పలికేందుకు ఐఏఎఫ్‌ బృందం ఇప్పటికే వాఘా చేరుకుంది.

380 thoughts on “అభినందన్‌ కోసం విమానాన్ని పంపుతామంటే వద్దన్న పాక్

Leave a Reply

Your email address will not be published.