అలోక్ వర్మ రాజీనామా తిరస్కరణ

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలను స్వీకరించకుండా ఉన్నందుకు క్రమశిక్షణ చర్యలను చేపట్టింది. మరోవైపు, ఉద్యోగానికి అలోక్ వర్మ చేసిన రాజీనామాను కూడా తిరస్కరించింది. ఓ సీనిమర్ మంత్రి మాట్లాడుతూ, వర్మపై విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన రాజీనామాను ఆమోదించబోమని స్పష్టం చేశారు.

ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా తక్షణమే బాధ్యతలను స్వీకరించాలని ఆదేశిస్తూ వర్మకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. . అయినప్పటికీ వర్మ కొత్త బాధ్యతలను చేపట్టలేదు. దీనిపై వర్మ స్పందిస్తూ, 2019 జనవరి 10న సీబీఐ డైరెక్టర్ గా తాను ఉద్యోగ విరమణ పొందానని తెలిపారు. అధికారిక రికార్డుల ప్రకారం 1957 జులై 14 న తాను జన్మించానని… ఆ లెక్క ప్రకారం 2017 జులై 31నే తాను పదవీ విరమణ పొందానని చెప్పారు.

ఇప్పటికే 60 ఏళ్లను పూర్తి చేసుకున్న తాను జనవరి 10 సీబీఐ డైరెక్టర్ గా పదవీ విరమణ పొందానని తెలిపారు. దీంతో కన్నెర్ర చేసిన కేంద్రం..  అల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సర్వీస్ రూల్స్ ను వర్మ బేఖాతను చేశారంటూ, ఆయనపై విచారణకు ఆదేశించింది. అంతేకాదు, ఆయన రిటైర్ మెంట్ బెనెఫిట్స్ ను కూడా నిలిపేసింది. 

 

Leave a Reply

Your email address will not be published.