ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా విక్రమ్‌నాథ్‌

గఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నియమితులయ్యారు. ఆయన పేరు ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. కొత్త సంవత్సరం తొలి రోజున ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ తాత్కాలికంగా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఇప్పుడు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పేరును కొలీజియం ఖరారు చేసింది.
జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. 2004 సెప్టెంబర్‌ 24న అదే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 సెప్టెంబర్‌ 23 వరకు ఆయన సర్వీసులో ఉండనున్నారు.

One thought on “ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా విక్రమ్‌నాథ్‌

Leave a Reply

Your email address will not be published.