ఎన్నికల కమిషన్‌పై సీఎం చంద్రబాబు నిరసన

ఎన్నికల కమిషన్‌పై సీఎం చంద్రబాబు కన్నెర్ర చేశారు. సీఈవో బ్లాక్‌ ఎదుట ఆయన నిరసనకు దిగారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులకు నిరసనగా ఆందోళనకు దిగారు. నిరసనతో ఈసీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు సీఎం సీఈవో ద్వివేదిని కలిశారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై చంద్రబాబు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఫిర్యాదుపై ద్వివేది సానుకూలంగా స్పందించినట్లు సమాచారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించే ఎన్నికల కమిషన్ తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై టీడీపీ ముందు నుంచే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల ఏపీ చీఫ్ సెక్రటరీ అనిల్ కుమార్ పునేఠాను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్త సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. పునేఠాను ఎన్నికల విధులకు సంబంధంలేని శాఖలో నియమించాలని ఆదేశాల్లో పేర్కొంది.

ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్‌ను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఒంగోలు ఎస్పీగా సిద్ధార్థ కౌశల్‌ని నేరుగా ఈసీ నియమించింది. పోలీసు అధికారుల పనితీరుపై వైసీపీ ఇటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేసింది. వైసీపీ అత్యధికంగా 4 జిల్లాల పోలీసు అధికారులపై ఫిర్యాదులు చేసింది. ఇందులో ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు ఉన్నాయి. ఒంగోలు ఎస్పీ కోయ ప్రవీణ్‌పై ఒకే ఫిర్యాదును వేర్వేరు వ్యక్తులు అనేక సార్లు ఎన్నికల సంఘం అధికారులకు అందజేశారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై టీడీపీ మండిపడుతోంది

1,856 thoughts on “ఎన్నికల కమిషన్‌పై సీఎం చంద్రబాబు నిరసన