ఎన్నికల సంఘం తీరు ఏకపక్షం : మండిపడిన సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన 9 పేజీల లేఖ కూడా సమర్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఈ విషయంపై ఆవేదన కలుగుతోందని అందులో వివరించారు.

రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌ అధికారులు సహా నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావును సైతం ఏకపక్షంగా బదిలీ చేసిందని వివరించారు. తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీని కూడా బదిలీ చేశారని చెప్పారు. వైకాపా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎలాంటి విచారణ జరపకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఎలా బదిలీ చేస్తుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఒక ముఖ్యమంత్రి కలవడం ఇది తొలిసారి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డలో డబ్బులు వెదజల్లుతున్నా పట్టించుకోలేదని ఎన్నికల కమిషన్‌పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తున్నామని, తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని, వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని ఈసీని కోరామని తెలిపారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఓట్లను కౌంట్‌ చేయడానికి 6 రోజులు పడుతుందని సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఈసీపై మండిపడ్డారు.

డేటా చోరీ కేసులో ఐపీ అడ్రస్‌లు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో 25 లక్షలు ఓట్లు తీసేస్తే సారీ చెప్పి వదిలేశారని విమర్శించారు. దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్నారు. ఈసీ పరిధిలో లేకున్నా అధికారులను బదిలీ చేశారని, ఎలాంటి కంప్లయింట్‌ లేకపోయినా కడప ఎస్పీని బదిలీ చేశారని దుయ్యబట్టారు. సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీ చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలపై ఏకపక్షంగా ఐటీ దాడులు చేశారని, వైసీపీలో అవినీతిపరులు లేరా? ఎందుకు దాడులు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణలో రూ.8 కోట్లు పట్టుబడినా చర్యలు లేవని చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

2 thoughts on “ఎన్నికల సంఘం తీరు ఏకపక్షం : మండిపడిన సీఎం చంద్రబాబు

 • May 8, 2019 at 6:53 am
  Permalink

  Excellent post. I was checking constantly this blog and I’m impressed! Very useful info specifically the last part 🙂 I care for such information a lot. I was looking for this particular information for a very long time. Thank you and good luck.

  Reply
 • May 18, 2019 at 6:37 am
  Permalink

  My partner and I stumbled over here from a different web address
  and thought I should check things out. I like what I see so i am just following you.
  Look forward to looking into your web page repeatedly.

  Reply

Leave a Reply

Your email address will not be published.