కమల్‌హసన్ కు రజినీకాంత్ మద్దతు

తమిళనాట లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీకి రజినీకాంత్ మద్దతు పలికారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ స్వయంగా ఈ విషయం చెప్పారు. గతంలో తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ సందర్భంగా రజినీకాంత్‌ను తాను మద్దతు కోరానని.. అందుకు ఆయన సరేనన్నారని కమల్ తెలిపారు. తమ పార్టీ విజయం సాధించాలని రజినీ ఆకాంక్షించారని.. ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారని.. ‘రేపటి రోజు మనదే’ అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారని కమల్ చెప్పారు. తమను బీజేపీకి బీ టీమ్‌గా ఆరోపించడాన్ని కమల్ తీవ్రంగా ఖండించారు. అలా అనే వాళ్లే ఫలితాల తర్వాత కూటమి కట్టడానికి పోటీ పడతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం ) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 39 లోక్‌సభ, ఉప ఎన్నికలు జరగనున్న 18 అసెంబ్లీ స్థానాల్లో ఎంఎన్ఎం పార్టీ బరిలో నిలిచింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి కమల్ దూరంగా ఉన్నారు.

One thought on “కమల్‌హసన్ కు రజినీకాంత్ మద్దతు

  • May 8, 2019 at 7:08 am
    Permalink

    I?¦m not sure the place you’re getting your info, however good topic. I needs to spend a while finding out more or working out more. Thank you for magnificent information I was on the lookout for this information for my mission.

    Reply

Leave a Reply

Your email address will not be published.