కాపలాదారే దొంగయ్యారు: రాహుల్


దేశ కాపలాదారు  దొంగగా మారారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాఫెల్ కుంభకోణంపై జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తి అయిన అనిల్ అంబానీకి లబ్ది చేసేందుకే మోదీ బ్రోకర్ లా వ్యవహరించారని తీవ్రంగా మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందంపై పార్లమెంట్ సాక్షిగా అబద్దాలాడారని దుయ్యబట్టారు. రాఫెల్ ఒప్పందంలో మోదీకి నేరుగా ముడుపులు అందాయని ఆరోపణలు సంధించారు. రక్షణ శాఖతో సంబంధం లేకుండా పీఎంవో నేరుగా ఒప్పందం చేసుకుందని, దీనిపై రక్షణ శాఖ దగ్గర సాక్ష్యాలున్నాయని పేర్కొన్నారు. రక్షణశాఖ వ్యతిరేకించినా ఎందుకు ఒప్పందం చేసుకున్నారని, దీనికి మోదీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

880 thoughts on “కాపలాదారే దొంగయ్యారు: రాహుల్