కోబ్రా సినిమాలో ఇంటిలిజెన్స్‌ అధికారిగా రాంగోపాల్ వర్మ

 అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడి జీవితం ఆధారంగా ‘కోబ్రా’ సినిమాను తీస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చెప్పారు. ఆయన నటుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఆదివారం వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శత్రువుని చంపటానికి త్రాచు పాముని చేరదీస్తే.. ఎప్పుడో ఒకప్పుడు మనల్ని కూడా కాటేస్తుంది అంటూ విడుదలైన పోస్టర్‌ ఆసక్తిని పెంచింది. వర్మ ఓ చేతిలో గన్‌, మరో చేతిలో సిగరెట్‌ పట్టుకుని కనిపించారు.
కాగా ఈ సినిమా గురించి తాజాగా వర్మ ట్వీట్‌ చేశారు. ‘‘కోబ్రా’ను తెలుగు, హిందీ భాషల్లో  విడుదల చేయబోతున్నాం. భారత నేర చరిత్రలోనే ఎప్పుడూ గుర్తించని అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడి బయోపిక్‌ ఇది. నూతన నటుడు కేజీ ఇందులో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. నేను ఇంటిలిజెన్స్‌ అధికారి పాత్రలో నటిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

వర్మ కొత్త సినిమా గురించి తెలుసుకున్న అమితాబ్‌ బచ్చన్‌ ఆల్‌ ది బెస్ట్ చెబుతూ ట్వీట్‌ చేశారు. ‘చివరికి రామ్‌ గోపాల్‌ వర్మ తనలోని నటుడిని గుర్తించి, బయటికి తీశాడు. ఆల్‌ ది బెస్ట్‌ సర్కార్‌. ప్చ్‌.. పోటీగా ఇంకొకరొచ్చారే’ అంటూ దిగాలుగా ఉన్న ఎమోజీలను బిగ్‌బి షేర్‌ చేశారు. దీనికి వర్మ ఉబ్బితబ్బిబై.. ‘సర్కార్‌..’ అంటూ సంబరంగా డ్యాన్స్‌ చేస్తున్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు.
అమితాబ్‌ ట్వీట్‌ను కన్నడ నటుడు సుదీప్‌ రీట్వీట్‌ చేస్తూ.. ‘నిజమైన ‘సర్కార్’ అమితాబ్‌ మాటల్లోని తీయదనం నచ్చింది. రామ్‌గోపాల్‌ వర్మ.. మీ కొత్త అవతారం చూసి మీతో కలిసి పనిచేసిన వారందరిలోనూ ఉత్సుకత నెలకొంది. వీలైతే మేమంతా కలిసి మీ సినిమా చూస్తాం సర్‌. ‘కోబ్రా’ సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌’ అని పేర్కొన్నారు.

One thought on “కోబ్రా సినిమాలో ఇంటిలిజెన్స్‌ అధికారిగా రాంగోపాల్ వర్మ

  • May 8, 2019 at 7:49 am
    Permalink

    This is really interesting, You’re a very skilled blogger. I’ve joined your feed and look forward to seeking more of your magnificent post. Also, I have shared your website in my social networks!

    Reply

Leave a Reply

Your email address will not be published.