చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చేంతవాడా కేసీఆర్: వీహెచ్

చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చేంత వాడా కేసీఆర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేశారని చెప్పారు. కేసీఆర్ పక్కా అవకాశవాద రాజకీయ నాయకుడు అని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెద్ద నాటకమని, మమతా బెనర్జీకి అన్యాయం జరిగితే కేసీఆర్ మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అందితే కాళ్లు, లేకుంటే జుట్టు పట్టుకుంటారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చేంతవారైతే జగన్ ఇంటికి కేటీఆర్‌ను ఎందుకు పంపిస్తారని వీహెచ్ ప్రశ్నించారు.

270 thoughts on “చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చేంతవాడా కేసీఆర్: వీహెచ్

Leave a Reply

Your email address will not be published.