జల్లికట్టులో ఇద్దరి పరిస్థితి విషమం

తమిళనాడులో పొంగల్ వేడుకల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జల్లికట్టు నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. జల్లికట్టు వేడుకలను వీక్షించేందుకు పలు ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. పుదుకొట్టే జిల్లా తసంగుర్చిలో తొలి జల్లికట్టు పోటీలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ ప్రారంభించారు. జల్లికట్టు పోటీలో భాగంగా 300 ఎద్దులను అదుపు చేయడానికి 400 మంది యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని పుదుకోట్టె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కుడా జల్లికట్టు నిర్వాహనకు ఏర్పాట్లు జరిగాయి.

15 thoughts on “జల్లికట్టులో ఇద్దరి పరిస్థితి విషమం

Leave a Reply

Your email address will not be published.