నల్ల చొక్కాలకు నో ఎంట్రీ.. పిల్లాడి స్వెట్టర్ కూడా విప్పించారు..

అసోం ముఖ్యమంత్రి సరబండ సోనోవాల్ సభలో పోలీసుల ఓవర్ యాక్షన్ చేశారు. చలిని తట్టుకోవడానికి ఓ తల్లి తన బిడ్డకు నల్ల స్వెట్టర్ వేస్తే దాన్ని తీస్తేనే కానీ, సీఎం సభకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. అంతదూరం వచ్చిన మహిళ.. చివరకు పిల్లాడి స్వెట్టర్ తీసేసింది. ఆ తర్వాత ఆమెను సభకు అనుమతి ఇచ్చారు పోలీసులు. సీఎం సభకు యాధృచ్ఛికంగా నల్ల డ్రెస్ వేసుకొచ్చిన ఎవరినీ పోలీసులు వదల్లేదు. చొక్కాలు తీస్తే ఎంట్రీ, లేకపోతే నో ఎంట్రీ అంటూ కరాఖండిగా చెప్పేశారు.

అసోంలోని బిశ్వనాథ్ జిల్లాలో ముఖ్యమంత్రి సవరబండ సోనోవాల్ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరయ్యారు. అయితే, నల్ల డ్రెస్సులతో నిరసన తెలుపుతారంటూ వారి దుస్తులను విప్పేయమనడం తీవ్ర దుమారం రేపుతోంది. పోలీసుల ముందు తల్లి తన స్వెట్టర్ తీసేయడంతో పిల్లాడు ఏడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది.పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పెద్దవాళ్లు నిరసన తెలుపుతారంటే ఓకే కానీ, ఈ మూడేళ్ల చిన్న పిల్లాడు కూడా నిరసన తెలుపుతాడా? అంటూ మండిపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్‌షిప్ బిల్లుపై అసోంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. దీంతో సీఎం సభలో నిరసన తెలుపుతారన్న భయంతో పోలీసులు వారిని నల్ల చొక్కాలతో సభకు అనుమతి ఇవ్వలేదు. అయితే, చిన్నారి స్వెటర్ను విప్పేసిన వీడియో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి సొనోవాల్ దీనిపై దర్యాప్తు జరపాలని డీజీపీని ఆదేశించారు.

 

 

654 thoughts on “నల్ల చొక్కాలకు నో ఎంట్రీ.. పిల్లాడి స్వెట్టర్ కూడా విప్పించారు..