పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్తున్న సిబ్బంది

రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఎన్నికల సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి సరిపోయిన విధంగా సిబ్బందిని వినియోగిస్తున్నారు.

ఏపీలో మొత్తం ఓటర్లు 3,93,45,717 మంది ఉండగా.. అందులో పురుష ఓటర్లు 1,94,62,339 మంది కాగా, మహిళా ఓటర్లు 1,98,79,421 మంది, ట్రాన్స్ జెండర్లు 3,967 మంది ఉన్నారు. రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాలకు 2,118 మంది, 25 లోక్ సభ స్థానాలకు 319  మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. పోలింగు సిబ్బంది మాత్రం ఉదయం ఆరు గంటలకే ఫోలింగు కేంద్రాలకు చేరుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

1,820 thoughts on “పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్తున్న సిబ్బంది