రాఫెల్ కేసులో సుప్రీం కోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ

రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కు సంబంధించిన కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై వేసిన రివ్యూ పిటిషన్లను తిరస్కరించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. విచారణ తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపింది. మరోవైపు, రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్ర వాదనతో కోర్టు ఏకీభవించలేదు. 
రాఫెల్ డీల్ పై మరోసారి విచారణ జరపాలంటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లు రివ్యూ పిటిషన్లను వేశారు. ఈ పిటిషన్లను కొట్టి వేయాలంటూ కోర్టును కేంద్రం కోరింది. అయితే, పిటిషనర్లు సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా విచారణ జరుగుతుందని సుప్రీం తెలిపింది.

రఫేల్‌ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ గతేడాది డిసెంబరు 14న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఈ తీర్పుపై మరోసారి సమీక్ష జరపాలని కోరుతూ ప్రశాంత్‌ భూషణ్‌, అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హా న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. 

ఇదిలా ఉండగా రఫేల్‌ ఒప్పందానికి సంబంధించి కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. వీటిని ది హిందూ పత్రిక ప్రచురించగా ఆ పత్రాలను రివ్యూ పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. ఈ పత్రాల ప్రాతిపదికన విచారణ జరపాలని కోరారు. అయితే దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రక్షణశాఖ నుంచి ఆ పత్రాలను దొంగలించి వాటి ఫొటో కాపీలను కోర్టుకు ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. అలా అక్రమ మార్గంలో తీసుకొచ్చిన పత్రాల ఆధారంగా తీర్పును రివ్యూ చేయడం సరికాదని పేర్కొంది. 

వాదోపవాదాలు విన్న అనంతరం కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్‌ ఆధారంగా రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. త్వరలోనే విచారణ తేదీని ఖరారు చేస్తామని వెల్లడించింది.

One thought on “రాఫెల్ కేసులో సుప్రీం కోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ

  • May 8, 2019 at 8:17 am
    Permalink

    Wow, amazing blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall look of your website is wonderful, let alone the content!

    Reply

Leave a Reply

Your email address will not be published.