వెంకటేశ్‌ కుమార్తె ప్రీ వెడ్డింగ్‌

విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జరగనుంది. పెళ్లి వేడుకల కోసం ఇరు కుటుంబ సభ్యులు శుక్రవారం జయపుర చేరుకున్నారు. ఆదివారం ఆశ్రిత వివాహం జరగనుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి జయపురలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన జయపుర విమానాశ్రయంలో ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో వెంకటేశ్‌ కుటుంబంతో కలిసి సల్మాన్‌ దిగిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పెళ్లి సంగీత్‌లో నాగచైతన్య, సమంత, రానా తదితరులు నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారట. జయపురలోని ఓ ప్రముఖ హోటల్‌ పెళ్లికి వేదికైనట్లు చెబుతున్నారు. శనివారం సాయంత్రం సంగీత్‌, ఆదివారం వివాహ వేడుక జరగనున్నాయి. ఫిబ్రవరి 6న ఆశ్రిత, వినాయక్‌ల నిశ్చితార్థం జరిగిందట. చాలా ఏళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల అనుమతితో ఒక్కటి కాబోతున్నట్లు తెలిసింది.

One thought on “వెంకటేశ్‌ కుమార్తె ప్రీ వెడ్డింగ్‌

Leave a Reply

Your email address will not be published.