శ్రీవారి చెంత ‘యన్‌టిఆర్‌’ చిత్రబృందం

‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’ చిత్రం బుధవారం విడుదలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని నటుడు నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్‌, సుమంత్‌, సాయి కొర్రపాటి తదితరులు బుధవారం స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న బృందానికి తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’ చిత్రం విడుదలవుతున్న కారణంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు బాలకృష్ణ తెలిపారు…

కొత్త ప్రోమో విడుదల :

అలనాటి నటుడు ఎన్టీ రామారావు జీవితాధారంగా తెరకెక్కిన ‘యన్‌టిఆర్‌’ చిత్రంలోని తొలి భాగం ‘కథానాయకుడు’ బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లు, పాటలు, ప్రోమోలతో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ‘కథానాయకుడు’ చిత్రంలోని ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..’  అనే పాటను విడుదల  చేశారు. ఈ పాటలో తన తండ్రి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారు.

 

412 thoughts on “శ్రీవారి చెంత ‘యన్‌టిఆర్‌’ చిత్రబృందం

Leave a Reply

Your email address will not be published.