సీబీఐ కొత్త చీఫ్ గా రిషి కుమార్ శుక్లా

కేంద్రదర్యాప్తు సంస్థ(సీబీఐ) నూతన డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లా నియమితులయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ  శుక్లాను ఎంపిక చేసింది. ఈ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఈ పదవిలో శుక్లా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.  గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా శుక్లా పని చేశారు. 1983 బ్యాచ్ కు చెందిన శుక్లాపై పెద్దగా వివాదాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలోనే సీబీఐ పగ్గాలను ఆయనకు అప్పగించేందుకు సెలెక్షన్ కమిటీ మొగ్గుచూపినట్టు సమాచారం. 

439 thoughts on “సీబీఐ కొత్త చీఫ్ గా రిషి కుమార్ శుక్లా

Leave a Reply

Your email address will not be published.