175 స్థానాల్లో నేనే అభ్యర్థిని : సీఎం చంద్రబాబు

‘‘మీ పిల్లలు పెద్దయ్యేసరికి నేను ఉంటానో, లేదో తెలియదు. కానీ ఈ తరం చల్లగా ఉండాలి. రాబోయే తరం బాగుండాలి అనేది నా ఆలోచన. రాష్ట్ర కుటుంబ పెద్దగా అది నా బాధ్యతగా భావిస్తున్నా. నేను శాశ్వతం కాదు. రాష్ట్రం శాశ్వతం. పూర్తవుతున్న పోలవరం శాశ్వతం. నిర్మిస్తున్న అమరావతి శాశ్వతం. రాయలసీమలో పారే నీరు శాశ్వతం. నాగావళి, వంశధార శాశ్వతం. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవటానికి తాను చేస్తున్న ‘ధర్మపోరాటం’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తాను అందరివాడిగా ఆలోచిస్తుంటే… వైకాపా కులాలు, మతాల ప్రస్తావనతో దుర్మార్గం చేస్తోందని విమర్శించారు. రాబోయే ఐదేళ్లు రాష్ట్రానికి అత్యంత కీలక సమయమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓటేయాలని ప్రజలను కోరారు. మంగళవారం సాయంత్రం ఉండవల్లి ప్రజావేదికలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దృశ్య సహిత ప్రదర్శన ఇస్తూ మాట్లాడారు. రాష్ట్రానికి ఇప్పటివరకూ చేసింది, మున్ముందు చేయబోయేది, రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దనున్నది ఆయన వివరించారు. ‘‘మీరు ఓటేసేప్పుడు గుర్తుండాల్సింది నేనే. స్థానికంగా ఉండే నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు. 175 నియోజకవర్గాల్లో నేనే అభ్యర్ధిని. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి’’ అని కోరారు. ‘‘తెలంగాణలో ఆంధ్రావాళ్ల పెత్తనమేంటని కేసీఆర్‌ ఒకప్పుడు అడిగారు. నేను ఇప్పుడు అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ పెత్తనమేంటి? ఆయనతో పెత్తనం చేయించాలని జగన్‌ ప్రయత్నించడమేంటి? ఆంధ్ర ప్రజలకు ఆత్మగౌరవం లేదనుకుంటున్నారా? అమ్ముడుపోతాం అనుకుంటున్నారా? నేను రాష్ట్రం కోసం కష్టపడుతుంటే… మన బతుకు మనల్ని బతకనీయకుండా చేయాలని మోదీ, కేసీఆర్‌, జగన్‌లు కలిసి కుట్రలు చేస్తున్నారు. ఏపీకి అన్యాయం చేస్తున్నందునే ఆ ముగ్గురిపై పోరాటం చేస్తున్నా. జగన్‌ వారితో లాలూచీపడి రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. కోడి కత్తి, ఓట్ల తొలగింపు కేసులతో పాటు ఇతర కేసుల్లో కాపాడుతున్నాడనే మోదీ చాలా పవర్‌ఫుల్‌ అని జగన్‌ అంటున్నారు. అవినీతిపరుల్ని కాపాడే వ్యక్తి, వారిని పెంచి పోషించే వ్యక్తి మోదీయే. ఆయనకు తోడుగా కేసీఆర్‌ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. పోలవరాన్ని అడ్డుకోవడానికి, అమరావతిని ఆపేయడానికి, సంక్షేమాన్ని నిలిపేయడానికి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడు అనని విధంగా జగన్‌ నన్ను దూషించారు. నేను ఏం తప్పు చేశాను? ఆయన అన్ని మాటలంటుంటే ఎందుకు పడాలి?

కేసీఆర్‌ను ఎందుకు అభినందిస్తున్నావ్‌ జగన్‌?
* పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకుగాను న్యాయస్థానంలో 30 పేజీల ప్రమాణపత్రం దాఖలు చేసినందుకా?
* నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను లాక్కోవాలని అనుకుంటున్నందుకా?
* ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల్లో వాటా కింద రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తులు ఏపీకివ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ఇవ్వనందుకా?
* ఆంధ్రుల సంస్కృతిని, చరిత్రను, వంటలను, మనుషులను కించపరిచేలా, హేళనచేసేలా మాట్లాడినందుకా?
* కృష్ణా జలాల ట్రైబ్యునల్‌లో ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా 74 పేజీల ప్రమాణపత్రం దాఖలు చేసిందుకా?
* ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడులకు అడ్డం పడుతున్నందుకా? చంద్రబాబు అను నేను హామీ ఇస్తున్నాను..! * మీ భవిష్యత్తు నా బాధ్యత. * ఏపీని ప్రపంచంలోనే అత్యుత్తమగమ్యస్థానంగా మారుస్తాం.  మా కృషి ఫలితంగా ఏపీకి 740 అవార్డులు వచ్చాయి.
 

108 thoughts on “175 స్థానాల్లో నేనే అభ్యర్థిని : సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published.